![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.
ఇక మహా, చక్రిలని కారులో ఎక్కించుకొని బాలు వెళ్తాడు. ఇక ప్రతాప్, భూషణ్ మళ్ళీ వాళ్ళని ఫాలో చేస్తారు. అసలు ఇతను ఎవరు అని మహా అడుగుతుంది. మాది కార్స్ డ్రైవర్స్ గ్రూప్.. అందులో వీడు(చక్రి) హెల్ప్ ఎమర్జెన్సీ అని మెసెజ్ చేశాడు. నేను ఇక్కడ దగ్గర్లో ఉన్నాను.. వచ్చేశానని చెప్తాడు. ఇక మహా, చక్రిలని బాలు తప్పిస్తాడు. భూషణ్, ప్రతాప్ వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తారు. మహాని లేచిపోయిన అమ్మా అని చక్రిని లేచిపోయినోడా అని బాలు పిలుస్తాడు. ఇక అదే సమయంలో బాలు వాళ్ళింటికి చక్రి నడిపే కారు ఓనర్ వస్తాడు. మీ చక్రి ఎక్కడ.. మీకు కాల్ చేసాడా అని అడుగుతాడు. లేదని వాళ్ళు చెప్తారు. ఏం జరిగిందని చక్రి వాళ్ళ అన్న అడుగుతాడు. మీ వాడు ఒక గొప్పింటి అమ్మాయిని లేపుకెళ్ళాడు. వాడు ఎక్కడున్నా .. కాల్ చేసిన చెప్పండి.. ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగించమని చెప్పండి అంటూ కార్ ఓనర్ చెప్తాడు. ఒకవేళ అలా చేయకపోతే మీ వాడిని చంపేస్తారని ఆ ఓనర్ బెదిరిస్తాడు.
కారు ఓనర్ అలా చెప్పడంతో చక్రి వాళ్ళ అన్నయ్య టెన్షన్ పడతాడు. మరోవైపు భూషణ్ , ప్రతాప్ వాళ్ళు బాలు కార్ ని ఫాలో చేస్తుంటారు. ఇక బాలు తెలివిగా ఒక దగ్గర టర్న్ తీసుకుంటాడు. అయితే మళ్ళీ వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఇక కాసేపటికి బాలు ఒక పోలీస్ స్టేషన్ దగ్గర కార్ ఆపుతాడు. వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పగా సరే అని చక్రి, మహా వెళ్తారు. ఇక బాలు కార్ ని చూసి రౌడీలు అతడి దగ్గరికి వస్తారు. చక్రి, మహా ఎక్కడ అని అడుగగా లేరని బాలు చెప్తాడు. రౌడీలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |